పండ్లు పంపిణీ..
కడం, ఆంధ్రప్రభ : కడం మండల కేంద్రంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ స్వర్గీయ రమేష్ రాథోడ్(MP Late Ramesh Rathod) జయంతి వేడుకలను బిజెపి కడెం మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాథోడ్ రమేష్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కడెంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులకు పండ్లును పంపిణీ చేశారు.
ఇందులో బీజేపీ(BJP) ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్, మండల సీనియర్ నాయకులు జక్కుల సత్తన్న, ధర్మాజీ క్రిష్టయ్య(Dharmaji Kristaiah), మండల ప్రధాన కార్యదర్శులు రాపర్తి శ్రీను, పూస శ్రీరామ్, మండల నాయకులు యమ్. గంగాధర్ ములికి కృష్ణ, తిరుమలయ్య, కర్ణాటక భీమన్న, యన్. ప్రసాద్, గట్ల నల్లగొండ, తోట రాజేష్, పాలకుర్తి, నగేష్, ప్రసాద్, దేవిదాస్, రాపెల్లి కొండయ్య, బైరి రమేష్, రామగిరి రంజిత్(Ramagiri Ranjith), మార్కండయ్య, మనోజ్, సురేందర్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.