Digital | ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ…

Digital | ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ…
Digital | ఖమ్మం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ దినపత్రిక ప్రచురించిన 2026 క్యాలెండర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ ఈ రోజు ఆవిష్కరించారు. స్థానిక కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో చైతన్య జైనీ ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించి ఆంధ్రప్రభ దినపత్రిక నిర్వహిస్తున్న సేవలను అభినందించారు.
పత్రికా విలువలను, డిజిటల్ రంగంలో ఆంధ్రప్రభ సాధిస్తున్న ప్రగతిని ప్రత్యేకంగా కొనియాడారు. ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకకుండా, కేవలం ప్రజా సమస్యలే ఎజెండాగా పని చేయడం అభినందనీయమన్నారు. 8 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువుగా ఆంధ్రప్రభ దినపత్రిక మారిందన్నారు. ముఖ్యంగా బడుగు బలహిన వర్గాల సమస్యలను, హక్కుల గురించి పరిపూర్ణంగా వ్రాసే పత్రికని కోనియాడారు.
ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోని పోయి సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్నది ఆంధ్రప్రభ పత్రిక అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏఎమ్ఓ పెసర ప్రభాకర్ రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ నాళ్ళ భానుచందర్, ఆంధ్రప్రభ ఎడ్యుకేషన్ జర్నలిస్ట్ గుంజులూరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
