అధికారుల గాలింపు చర్యలు..
మణుగూరు, (ఆంధ్రప్రభ న్యూస్ ) : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని మణుగూరు బాలికల సదనం నుండి ఇద్దరు బాలికలు మిస్సింగ్ (Missing Girls) అయిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. భద్రాచలం పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలకు బాల్య వివాహాలు అవ్వడంతో వారిని సదనంలో అధికారులు చేర్చారు. వారు ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు సదరం ప్రాంగణంలోకి వచ్చారు. ఎవరు లేరని గ్రహించి.. బాలికలు సదనం గోడ దూకి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సదనం అధికారులు వాళ్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

