ట్రంప్ దిగివచ్చారా?
ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఏకపక్ష వాణిజ్య విధానాలు, ఆధిపత్య ధోరణి ఇప్పుడు ఆయనకు తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలేలా చేస్తున్నాయి. ప్రపంచానికి పెద్దన్న… తాను ఆడిందే ఆట… పాడిందే పాట… చెప్పిందే మాట… అన్నట్టు ప్రవర్తిస్తున్న ట్రంప్ దూకుడుకు డ్రాగన్ కళ్ళెం వేసింది.
తానే గొప్ప అంటూ విర్రవీగిన ట్రంప్‌కు తాజాగా చైనా గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ విధించిన సుంకాలను కట్టేదేలేదు పో అంటూ తల విదిల్చింది… ప్రత్యామ్నయా వాణిజ్య మార్గాలను ఎంచుకుంది…ఫలితంగా ట్రంప్ దిగిరాక తప్పలేదు….
అమెరికాతో అత్యధికంగా వాణిజ్య ఒప్పందాలు కలిగిన చైనా, ట్రేడ్ వార్ నేపథ్యంలో అమెరికాపై కఠిన హెచ్చరికలు జారీ చేసింది. 100 శాతం టారిఫ్‌లు విధిస్తే, అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ (Rare Earth Minerals) ఎగుమతులను నిలిపివేస్తామంటూ చైనా బహిరంగంగా అమెరికాను హెచ్చరించింది.
దీనికితోడు, దౌత్యపరంగా పలు ప్రధాన అంశాల్లో చైనా మెలిక పెట్టడంతో… చివరికి అమెరికా కాళ్ల బేరానికి దిగివచ్చినట్లు తెలుస్తోంది.
మరి చైనా పెట్టిన ఆ మెలిక ఏమిటి? ట్రంప్ ప్రభుత్వం ఏ విధంగా రాజీ పడింది? ఈ అంశంపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్రింద ఇచ్చిన వీడియో లింక్ చూడండి.

