Dhurandhar 3 | అసలు నిజం ఏంటి..?

Dhurandhar 3 | అసలు నిజం ఏంటి..?
Dhurandhar 3 | బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ధురందర్’
భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ‘ధురందర్ 2’
రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ వైరల్
రిలీజ్‌కు ముందే ‘ధురందర్ 3’పై పుకార్లు
పార్ట్ 3పై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ లేదు
Dhurandhar 3 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా ధురందర్. రణ్ బీర్ సింగ్ నటించిన ధురందర్ మూవీని ఆదిత్య ధర్ తెరకెక్కించాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సరికొత్త రికార్డులు సెట్ చేసింది. దీంతో ధురందర్ 2 పై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఈ నెల 19న ధురందర్ 2 మూవీ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ధురందర్ 3 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనా..?
Dhurandhar 3 | భారీ ఓపెనింగ్ వచ్చేలా బజ్..

ధురందర్ సినిమా బాలీవుడ్ కి జోష్ తీసుకువచ్చింది. సరైన సక్సెస్ లేక థియేటర్స్ బిజినెస్ తగ్గిపోయిందని.. బాలీవుడ్ బాధపడుతున్న తరుణంలో ధురందర్ రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. ఈ సినిమా గురించి వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ధురందర్ 2 సినిమా అంచనాలకు మించి ఉంటుందని.. ఆ మూవీ కంటే ఎక్కువుగా రామ్ గోపాల్ వర్మనే ప్రచారం చేస్తుండడం విశేషం. నార్త్ లోనే కాకుండా.. సౌత్ లో కూడా ధురందర్ మూవీకి భారీగా ఓపెనింగ్ వచ్చేలా బజ్ క్రియేట్ అయ్యింది.
Dhurandhar 3 | పార్ట్ 3 పుకార్లు..

ఇదిలా ఉంటే.. ధురందర్ 2 రిలీజ్ కాకుండానే.. ధురందర్ 3 గురించి వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు మేకర్స్ పార్ట్ 3 గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు. అయితే.. ప్రస్తుతం పార్ట్ 3 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. ఖచ్చితంగా పార్ట్ 3 ఉంటుందని ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్ గా పార్ట్ 1 రిలీజైన తక్కువ టైమ్ లోనే పార్ట్ 2 రిలీజ్ చేసినట్టుగా పార్ట్ 3 ని కూడా తక్కువ టైమ్ లోనే రిలీజ్ చేస్తారని.. జూన్ లో పార్ట్ 3 రిలీజ్ ఉండచ్చు అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. మేకర్స్ మాత్రం ఎలాంటి కన్ ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

