Dhurandhar 2 | ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది…?

Dhurandhar 2 | ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది…?

Dhurandhar 2 | ధురంధర్ 2కి బ్లాక్‌బస్టర్ టాక్
ఓవర్సీస్‌లో 3 రోజుల్లో 10 మిలియన్ కలెక్షన్స్
ఇప్పటి వరకు ఉన్న రికార్డులు బ్రేక్ చేస్తున్న ధురంధర్ 2
వారణాసి మూవీకి ధురంధర్ 2 టార్గెట్
రాజమౌళి ప్లానింగ్‌తో భారీ అంచనాలు
ఫుల్ రన్‌లో 2000 కోట్ల దిశగా ధురంధర్ 2

Dhurandhar 2 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ధురంధర్ 2.. ఇప్పుడు సినీ అభిమానులు ఎవరి నోట విన్నా.. ఇదే మాట. ధురంధర్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో.. ధురంధర్ 2 అంతకు మించి ఉంటుందని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. అంచనాలను అందుకుంటుందో లేదో అనుకుంటే.. అంచనాలకు మించి ఉందనే టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే.. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) వారణాసి మూవీకి ధురంధర్ 2 టార్గెట్ ఫిక్స్ చేసిందని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ధురంధర్ 2 సెట్ చేసిన టార్గెట్ ఏంటి…?

Dhurandhar 2

Dhurandhar 2 | 3 రోజుల్లో 10 మిలియన్స్..

ధురంధర్ 2 సినిమా గురించి ఆ లాంగ్వేజ్.. ఈ లాంగ్వేజ్ అనే తేడా లేకుండా అందరూ చెబుతున్న మాట.. బొమ్మ అదిరింది.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈమధ్య కాలంలో ఈ రేంజ్ రెస్పాన్స్ ఏ సినిమాకి రాలేదు. ఇప్పటి వరకు ఉన్న రికార్డులు క్రాస్ చేసేలా దూసుకెళుతుంది. ఈ మూవీ (Movie) ఓవర్ సీస్ లో జస్ట్ మూడు రోజుల్లో 10 మిలియన్స్ కలెక్ట్ చేయడం అంటే.. ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో.. జనాలు ఎంతలా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంత వరుకు ఏ సినిమా కేవలం 3 రోజుల్లో 10 మిలియన్స్ కలెక్ట్ చేయలేదు.

Dhurandhar 2

Dhurandhar 2 | ధురంధర్ 2 ని క్రాస్ చేసేలా వారణాసి..

ఇప్పుడు ధురంధర్ 2.. వారణాసి మూవీకి టార్గెట్ ఫిక్స్ చేసిందని టాక్ వినిపిస్తోంది. మూడు రోజుల్లోనే 10 మిలియన్స్ వారణాసి మూవీ కలెక్ట్ చేస్తుందా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. దర్శకధీరుడు రాజమౌళి ప్లానింగ్.. ప్రమోషన్స్.. వేరే లెవల్లో ఉంటాయి. పైగా ఆయన ఈ సినిమాని చాలా దేశాల్లో రిలీజ్ చేసేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోతోనే అంచనాలు ఆకాశంలో ఉండేలా చేశారు. ఇక టీజర్ రిలీజ్ (Release) చేస్తే.. వేరే లెవల్లో ఉంటుందని ఇప్పటి నుంచే టాక్ వినిపిస్తోంది. ధురంధర్ 2 ఫుల్ రన్ లో ఈజీగా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని సినీ పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. వారణాసి ముందు.. ధురంధర్ 2 పెద్ద టార్గెట్టే ఫిక్స్ చేసేట్టుగా ఉంది. మరి.. ధురంధర్ 2 ఎంత కలెక్ట్ చేస్తుందో.. వారణాసి ఈ రికార్డ్ ను క్రాస్ చేస్తుందా..? లేదా…? తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Dhurandhar 2

Leave a Reply