ipl 2026 | రెండు వారాలు రెస్ట్‌

ipl 2026 | రెండు వారాలు రెస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సమరం కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సారి జరిగే ఐపీఎల్ పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రారంభం రోజునే క్రికెట్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్. CSK స్టార్ ప్లేయర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నారు. ఎంఎస్ ధోనీకి గాయమైనట్లు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్​కే) యాజమాన్యం ప్రకటించింది. కాలికి గాయం కారణంగా ధోనీ మొదటి రెండు వారాల పాటు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని ఫ్రాంచైజీ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేసింది. కొన్ని రోజులుగా ధోనీ ప్రాక్టీస్ సెషన్లలో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ధోనీ ప్రాక్టీస్ సెషన్ వీడియోలను సీఎస్​కే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తుంది. ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ధోనీ కాలిపిక్క కండరానికి గాయమైంది. దీంతో వైద్యులు అతన్ని రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి 19వ సీజన్ ప్రారంభం కానుంది. మే 31 వరకు జరుగనుంది. మొత్తంగా 10 జట్లు లీగ్‌లో తలపడనుండగా, 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో 4 ప్లేఆఫ్స్‌ ఉంటాయి. ఇవాళ చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనున్నాయి.

Leave a Reply