Dharna |ధర్నా ను విజయవంతం చేయాలి..

Dharna |ధర్నా ను విజయవంతం చేయాలి..

Dharna | శావల్యాపురం, ఆంధ్రప్రభః జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఈనెల 13వ తేదీ జరగనున్న ఉపాధ్యాయుల ధర్నాను విజయవంతం చేయాలని ఎస్టీయూ మండల ప్రధాన కార్యదర్శి చెంచులక్ష్మి కోరారు. మండల కేంద్రమైన శావల్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెంచులక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పాత బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. పిఆర్సీ కమిటీ వేసి, మధ్యంతర భృతి 30 శాతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిర్వహిస్తున్న ఈ ధర్నాను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొడ్డపాటి విజయలక్ష్మి, ఎస్టీయూ మహిళా బాద్యులు షానుషా, వరలక్ష్మి, అరిఫా, దూపాటి అనసూర్య, కోటేశ్వరరమ్మ, పీరాభి, మద్దం అదిలక్ష్మి అనూష, సౌజన్య, తదితర ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

Leave a Reply