హిందుత్వం మా డిఎన్ఏ..

హిందుత్వం మా డిఎన్ఏ..
- పొలిటికల్ ఎజెండా కాదు..
- ఎన్నికల కోసం రాజకీయాలు చేయము..
- ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్, ఆంధ్రప్రభ : హిందుత్వం మా డిఎన్ఏ పొలిటికల్ ఎజెండా కాదు అని ఎంపీ ధర్మపురి అర వింద్ అన్నారు. హిందుత్వ మా బతుకు దెరువు, నినా దం కాదనీ హిందూ రాజ్య స్థాపన కోసం ఎన్నేళ్లయిన పోరాడతామని అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ లో మెచ్యూర్డ్ పొలిటిషన్ లేడని ఎంపీ విమర్శిం చారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ఒక సమాధానం చెప్పాలి ఏమిటంటే 17 సంవత్సరా లుగా సుమారు రూ. 8 కోట్ల వరకు బకాయి చెల్లించకుండా ఉన్న వ్యక్తి కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వగానే కొన్ని రోజులోనే సుమారు రూ.8 కోట్ల వరకు బకాయి ల ఎలా చెల్లించాడో సీఎం సమాధానం చెప్పాలని ఎంపీ ప్రశ్నించారు. ఇంత పెద్ద మొత్తంలో ఒకే సారి ఎలా చెల్లించారు? కాంగ్రెస్ అభ్యర్థికి ఏమైనా లక్కీ లాటరీ వచ్చిందా లేదా.. పైసల్ ఎలా వచ్చాయో సూ టిగా ప్రశ్నించారు. పైసలు లేక కట్టక పోతే సంగతి వేరు… కానీ డబ్బులు ఉం డి కూడా ఇన్ని సంవత్స రాలుగా చెల్లించాల్సిన బకాయి ఎందుకు చెల్లించ లేదని ఎంపీ ఆగ్రహం వ్య క్తం చేశారు.
ఇన్ని సంవత్స రాలుగా మేనేజ్ చేసిన వ్యక్తి.. ఇవాళ బీజేపీ భయా నికి ఆస్తి పన్ను చెల్లించా డన్నారు. ఈ లెక్కన ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు కక్కించిన ఘనత బీజేపీ దేనని అన్నారు.రూ.8కోట్ల బకాయిలు వసూలు చేయ కుండా ఇన్నాళ్లు అధికా రులు ఎం చేశారో ప్రజలకు జవాబు చెప్పి తీరాల్సిం దేనని నొక్కి చెప్పారు. కాం గ్రెస్ మేయర్ అభ్యర్టీ.. ఒక చీటర్, ఒక ద్రోహి, అవి నీతి పరుడు.. ఇలాంటి వ్యక్తులు మేయర్ అయితే భవిష్యత్తులో నిలువు దోపి డీ జరుగుతుందన్నా రు. ప్రజల సొమ్ము ఎగ్గొట్టిన వ్యక్తి మేయర్ అయితే నిజామాబాద్ ప్రజలను శ్రీరాముడే కాపాడాలనీ ఎంపీ అన్నారు. ఇందూర్ ప్రజలు ఒక్కసారి ఆలోచిం చాలి అలాంటి వ్యక్తికి డిపా జిట్ కూడా రాకుండా బ్యా లెట్ తో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్న మైందని అన్నారు.
కాంగ్రెస్ నేతలకు నైతికత లే దు, ప్రజలంటే గౌరవం లేద నీ ఘాటుగా విమర్శిం చారు. రేవంత్ కన్నా సోని యా నా ఫ్యామిలికి దగ్గర కానీ హిందూ వ్యతిరేక పా ర్టీ అందుకనే అందులోకి రాలేదన్నారు. నా తండ్రి డీఎస్ ని అవమానించి కాంగ్రెస్ నుండి బయటకు పంపారన్నారు. డీఎస్ ఇంటి మీదపై దాడి చేసిన వ్యక్తు లను కాంగ్రెస్ లో చేర్చుకున్న నీచ చరిత్ర కాంగ్రెస్ నేతలదనీ ఎంపీ మండి పడ్డారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో స్వచ్ఛమైన పరిపాలన మా నినాదం మని ఎంపీ అన్నారు.ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
