Temple | పోటెత్తిన భక్తులు

Temple | పోటెత్తిన భక్తులు
సుబ్బారాయుడు ఆలయం కిటకిట
Temple | మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ప్రత్యేకత కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు (The devotees) పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆదివారం స్వామివారికి ఎంతో విశేషమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చినట్టు కార్యనిర్వహణదికారి దాసరి శ్రీరామవర ప్రసాదరావు చెప్పారు. సహాయక ఉద్యోగులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

