మహాశివరాత్రి శివాలయాలకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి శివాలయాలకు పోటెత్తిన భక్తులు

  • శివనామస్మరణతో శివాలయాలు
  • ప్రత్యేక ఏర్పాట్లతో దర్శనాలు

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం, శ్రీ గుడిమిట్ట శివాలయంలో శివరాత్రి పురస్కరించుకొని పట్టణ పరిసర గ్రామాల ప్రజలు శివాలయాలకు పోటెత్తారు. ఆదివారం రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయంలో క్యూలైన్లో ఉన్న భక్తులు శివనామస్మరణతో పరమశివుని దర్శించుకుని భక్తులు తన్మయం చెందారు. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక చింతనకు నిలయమైన శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకులు కోమాళ్ళపల్లి నాగభూషణం శర్మ, సంపత్ కుమార్ శర్మ, శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం ప్రధానార్చకులు జగన్నాధుల వెంకటేశ్వర చర్మ మహాశివరాత్రి పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ గుడిమిట్ట శివాలయంలో విశేష పూజా కార్యక్రమంలో నిర్వహించారు. ఈ శివాలయాలకు బ్రహ్మమూర్తమున భక్తులు భారీగా తరలివచ్చి అది దేవుడు పరమేశ్వరున్ని దర్శించుకుని అభిషేకాలు చేస్తూ భక్తి పరవశం తో తరించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పరకాల పోలీస్ సిఐ వి క్రాంతి కుమార్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులను క్రమబద్ధీకరించి రక్షణ చర్యలు చేపట్టారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

Leave a Reply