అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ: భీంగల్ పట్టణంలోని ఎనిమిదో వార్డులో బుధవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి ( స్వామి) పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ టీయూఎఫ్ఐడీసీ పథకం ద్వారా 11 కోట్లు మంజూరైన నిధుల్లో భాగంగా పట్టణంలో వివిధ వార్డులలో సీసీ రోడ్లు , సీసీ డ్రైనేజీల నిర్మాణం కల్వర్టులు, బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

అందులో భాగంగానే ఈరోజు 8వ వార్డులో సీసీ రోడ్ల పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు పట్టణంలో అన్ని వార్డులలో నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సంటి లత (జేజే నర్సయ్య ) వార్డ్ కౌన్సిలర్ సందీప్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply