Development | గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా

Development | గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా

  • నాచ‌న్ ఎల్లాపూర్ గ్రామ నూతన సర్పంచ్ బొడ్డు రాజేశ్వరి స్పందన

Development | కడెం, ఆంధ్రప్రభ : రాబోయే ఐదేళ్ల లోపు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సహకారంతో నాచ‌న్ ఎల్లాపూర్ గ్రామ పంచాయ‌తీని అన్ని రంగాల్లో అభివృద్ధి(Development) చేస్తామని గ్రామ సర్పంచ్ బొడ్డు రాజేశ్వరి స్పందన గంగన్న అన్నారు. కడెం మండలం నాచ‌న్ ఎల్లాపూర్ గ్రామ సర్పంచ్ గా బొడ్డు రాజేశ్వరి, ఉప సర్పంచ్ గా జాడి లక్ష్మి గ్రామ‌ వార్డు సభ్యులను ఎస్ఓ కడెం ఎంపిఓ టి.శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు.

అనంతరం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బొడ్డు రాజేశ్వరి ఉప సర్పంచ్ జాడి లక్ష్మి వార్డు సభ్యులను గ్రామ పెద్దలు పలు పార్టీల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు అభిమానులు(fans) స్థానిక పంచాయతీ సెక్రెటరీ శాంత శాలువాతో సన్మానించారు.

ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రాజేశ్వరి మాట్లాడుతూ… గ్రామ పెద్దల, ప్రజల యువకులు, మహిళలు సహకారంతో గెలిపించినందుకు త‌న‌పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ‌ బొజ్జు(MLA Vedma Bojju) సహకారంతో నాచ‌న్ ఎల్లాపూర్ గ్రామ‌పంచాయ‌తీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్న, పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply