ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయం…

ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయం…

ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

అమరావతి, ఆంధ్రప్రభ : ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పెదకూరపాడుఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. గురువారం నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో కేంద్రంలో జరిగిన చర్చలు, పార్లమెంట్‌లో వ్యక్తమైనఅభిప్రాయాలు రాష్ట్ర ప్రజల్లో కొత్త నమ్మకాన్ని నింపాయని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు. అమరావతి కేవలం ఒక రాజధాని నగరం మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు.

అమరావతి నిర్మాణం వెనుక రైతుల త్యాగం, ప్రజల ఆశలు, రాష్ట్ర భవిష్యత్తు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించడం దేశ చరిత్రలోనే అరుదైన సంఘటన అని తెలిపారు. ఈ త్యాగాన్ని గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.గతంలో అమరావతి అభివృద్ధి పనులు నిలిచిపోవడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని, యువతకుఅవకాశాలు తగ్గాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రజలు అమరావతి పట్ల తమ నమ్మకాన్ని కోల్పోలేదని అన్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతిని తిరిగి అభివృద్ధి దిశగా తీసుకెళ్తోందని, ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అమరావతి నిర్మాణం వేగవంతమవుతుందని విశ్వాసంవ్యక్తంచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అమరావతి కేంద్ర బిందువుగా నిలుస్తుందని, భవిష్యత్ తరాలకు ఇదిగొప్పఅవకాశాలను అందిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.అమరావ

Leave a Reply