ఘనంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం

ఘనంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం

ద్వాదశ జ్యోతిర్లింగాల అభిషేకం
భక్తులతో కిటకిటలాడిన దేవాలయం
ప్రత్యేక పూజలు నిర్వహించిన నెట్టెం రఘురాం..

నందిగామ, ఆంధ్రప్రభ : మక్కపేటలోని ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం లో నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, ద్వాదశ జ్యోతిర్లింగాల అభిషేకాలు వైభవంగా జరిగాయి. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెల గాంధీ ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం కార్యక్రమానికి హాజరై పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం భక్తులతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ… ఈ దేవాలయానికి తాను అధ్యక్షుడిగా సేవలు అందించడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి మల్లెల గాంధీతో పాటు కమిటీ సభ్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, రఘురాం ని సన్మానించారు.

ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బడినేని బాలకృష్ణ, బేతవోలు కట్ట దశరథరావు, మల్లెల శివ తదితరులు పాల్గొన్నారు. స్థానిక భక్తులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply