Devaruppula | సర్పంచ్‌లు, వార్డు నెంబర్లకు సన్మానం

Devaruppula | దేవరుప్పుల, ఆంధ్రప్రభ : గ్రామ సర్పంచ్ ఎన్నికలలో పెద్దమడూరు గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టినందున శుక్రవారం బీఆర్ఎస్ జనగామ నాయకుడు బబ్బురి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సర్పంచులు, వార్డ్ మెంబర్లకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం నూతన సర్పంచ్, వార్డు సభ్యులు కృషి చేయాలని ప్రజల మన్ననలు పొందాలని వారిని అభినందిస్తూ తెలిపారు.
