- మరో మూడు సబ్ స్టేషన్లకు శంకుస్థాపన
- పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కావ్య
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) పర్యటించారు. జిల్లాలోని కొత్తపల్లి గోరి మండలం చెన్నాపూర్ లో ఏర్పాటు చేసిన 33/11కెవి సబ్ స్టేషన్ (Sub station) ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావుతో కలిసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం సబ్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం..
పర్యటనలో భాగంగా జయశంకర్ జిల్లాకు చేరుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుకు చెన్నాపూర్ గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao), జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, జిల్లా అధికారులు పుష్ప గుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
2వేల వాహనాలతో భారీ బైక్ ర్యాలీ..
చెన్నాపూర్ సబ్ స్టేషన్ ప్రారంభం అనంతరం డిప్యూటీ సీఎం రోడ్డు మార్గం ద్వారా భూపాలపల్లికి బయలుదేరారు. భూపాలపల్లి మండలం మోరాంచపల్లికి చేరుకోగానే కాంగ్రెస్ (Congress ) శ్రేణులు ఘనస్వాగతం పలికారు. సుమారు 2వేల ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీతో భూపాలపల్లి మంజూర్ నగర్ సభా స్థలానికి చేరుకున్నారు.

మూడు సబ్ స్టేషన్లకు శంకుస్థాపన…
రూ.2కోట్ల వ్యయంతో భూపాలపల్లి (Bhupalapalli) మండలం మంజూర్ నగర్, చిట్యాల మండలం నవాబుపేట, గణపురం మండలం ధర్మారావుపేటలో నిర్మించే మూడు సబ్ స్టేషన్ లకు మంజూర్ నగర్ వద్ద డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ చైర్మన్ కర్నాటి వరుణ్ రెడ్డి (Karnati Varun Reddy), సింగరేణి అధికారులు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర కొమురయ్య, జిల్లా నాయకులు, పిప్పాల రాజేందర్, అప్పం కిషన్, దేవన్, దాట్ల శ్రీను, తోట సంతోష్, తోట రంజిత్, చరణ్, చుంచు మహేష్, కాంగ్రెస్, ఐఎన్టీ యూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.