Delhi exit polls | కమలానికి జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్
న్యూ ఢిల్లీ – ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఢిల్లీలో మొత్తం 70 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 36 సీట్లు వచ్చిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.ఎవరు గెలవనున్నారో చెప్పేశాయి సర్వేలు..
2020 ఎన్నికలతో పోలిస్తే 13శాతం ఓటింగ్ పెరగడంతో.. ఇది గెలుపోటములపై ప్రభావం చూపనుందని పేర్కొంటున్నాయి.. ఈ సారి బీజేపీ, ఆప్ మధ్య గట్టి పోటీ ఉందని కొన్ని ఛానెళ్లు అంచనా వేశాయి.. మరికొన్ని.. బీజేపీకి అనుకూలంగా.. ఇంకొన్ని ఆప్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
సర్వే సంస్థల్లో అధిక శాతం బీజేపీకే పట్టం గట్టాయి. బీజేపీకి ఆప్ కంటే కొన్ని సీట్లు అధికంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.
.ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
మ్యాట్రిజ్ బీజేపీ+ 35-40 సీట్లుఆప్‌కి 32-37 సీట్లుకాంగ్రెస్‌కి 0-1 సీట్లుఇతరులకు 0 సీట్లు
పీఎంఏఆర్‌క్యూఆప్ 21-31 సీట్లుబీజేపీ+ 39-49 సీట్లుకాంగ్రెస్ 0-1 సీట్లుఇతరులు 0 సీట్లు
జేవీసీఆప్ 22-31 సీట్లుబీజేపీ+ 39-45 సీట్లుకాంగ్రెస్ 0-2 సీట్లుఇతరులు 0-1 సీట్లు
పీపుల్స్ పల్స్‌ఆప్ 10-19 సీట్లుబీజేపీ+ 51-60 సీట్లుకాంగ్రెస్ 0 సీట్లుఇతరులు 0 సీట్లు
పీపుల్స్ ఇన్‌సైట్‌ఆప్ 25-29 సీట్లుబీజేపీ+ 40-44 సీట్లుకాంగ్రెస్ 1 సీటుఇతరులు 0
చాణక్యఆప్ 25-28 సీట్లుబీజేపీ+ 39-44 సీట్లుకాంగ్రెస్ 2-3 సీట్లుఇతరులు 0
పోల్ డైరీ ఆప్ 18-25బీజేపీ 42-50కాంగ్రెస్ 0-2
డీవీ రిసెర్చ్ఆప్ 26-34బీజేపీ ప్లస్ 36-44కాంగ్రెస్ 0ఇతరులు 0
వీప్రిసైడ్ఆప్ 46-52బీజేపీ ప్లస్ 18-23కాంగ్రెస్ 0-1ఇతరులు 0