Hyderabad | హైటెక్స్ లో ప్రారంభమైన దీప్ మేళా

హైద‌రాబాద్, జులై 18 (ఆంధ్ర‌ప్ర‌భ ) : హైటెక్స్ ఎగ్జిబిషన్ (Hitex Exhibition) లో అట్టహాసంగా దీప్ మేళా ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ నందిని మల్లు (Nandini Mallu) జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీప్ శిఖా మహిళా క్లబ్ ఆధ్వర్యంలో ఈ మూడు రోజుల మేళా జూలై 18 (శుక్రవారం ) నుండి 20 (ఆదివారం ) వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, హాల్ నం. 3, జరుగుతుంది. దీప్‌శిఖా మహిళా క్లబ్ హైదరాబాద్ (Hyderabad) కు కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ మహిళా సేవా సంస్థ. 61ఏళ్లు గా ఈ క్లబ్ సామాజిక సేవలో నిరంతరంగా నిమగ్నమై ఉంది.

మహిళల అభివృద్ధి, బాలబాలికలకు నాణ్యమైన విద్య అందించడమే క్లబ్ లక్ష్యం. 1987నుండి క్లబ్ వారు కన్యా గురుకుల హైస్కూల్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 1700మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. క్లబ్ కొత్త అధ్యక్షురాలు ప్రియాంక బహేటీ (Priyanka Baheti) నాయకత్వంలో దీప్ మేళా కోసం సభ్యులు కార్యాచరణలో నిమగ్నమయ్యారు. గత మూడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న వార్షికంగా మూడురోజుల ఫండ్‌రైజింగ్ ఎగ్జిబిషన్ గా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ మేళా ద్వారా సమాజ సేవా కార్యక్రమాలకు నిధులు సమీకరించి, స్థానిక వ్యాపారులను ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశం. దీప్‌శిఖా మహిళా క్లబ్ కమిటీ 2025 – 2026 : అధ్యక్షురాలుగా ప్రియాంక బహేటీ, మాజీ అధ్యక్షురాలు (ఐపిపి ): రాధికా మలాని, ఉపాధ్యక్షురాలు : సంగీతా జైన్, కార్యదర్శి : భావనా సంగీ, కోశాధికారి : మినాక్షి భురారియా, సహాయ కార్యదర్శి : శివాని తిబ్రేవాల్, సభ్యురాలు : ఇందిరా డోచానియా, సలహాదారు : ఉషా సంగీ, ఈ దీప్ మేళా 2025 – షాపింగ్ ప్రియులందరికీ ఒక అద్భుతమైన అవకాశంగా నిలవనుంది.

Leave a Reply