Deeksha Day | దీక్షా దివస్ కార్యక్రమం…

Deeksha Day | దీక్షా దివస్ కార్యక్రమం…

Deeksha Day | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఈ నెల 29న జిల్లా కేంద్రంలో జరగబోయే దీక్షా దివస్(Deeksha Day) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమగ్ర సన్నాహాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నారాయణపేట బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన సన్నాహక, సమీక్షా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రాజేందర్ రెడ్డి(S. Rajender Reddy) పాల్గొని సమావేశానికి నేతృత్వం వహించారు.

ఈ సమావేశంలో మాట్లాడుతూ.. రాజేందర్ రెడ్డి “దీక్షా దివస్ కార్యక్రమం పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజల్లో నిజాలను చేరవేయడంతో పాటు, బీఆర్ఎస్ పార్టీ(BRS Party) తీరును బలోపేతం చేసే సందేశాన్ని ఇవ్వాలన్నారు. అందుకోసం ప్రతి మండలం నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని” పిలుపునిచ్చారు.

అలాగే, నవంబర్ 29న(November 29) నిర్వహించాల్సిన కార్యక్రమం వ్యవస్థాపనలు, కార్యాచరణ, మైదాన ఏర్పాట్లు, కార్యకర్తల రవాణా, ప్రతి విభాగం బాధ్యతలను నేతలు సమన్వయంతో చేపట్టాలని సూచించారు. కార్యక్రమం నిర్వహణలో ఏ చిన్న లోపం లేకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

“దీక్షా దివస్ మన ఐక్యతను, మన పోరాట స్పూర్తిని ప్రజలకు చూపించే వేదిక. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు(People’s Representatives), పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన విభాగం, రైతు విభాగం నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply