మైనర్ బాలున్ని డీ డిక్షన్ తరలింపు

మైనర్ బాలున్ని డీ డిక్షన్ తరలింపు

చెన్నూర్ ఆంధ్రప్రభ : గంజాయి కి అలవాటు పడిన 17ఏళ్ళ మైనర్ బాలున్ని కోర్టు ఆదేశాల మేరకు చెన్నూరు పోలీసులు ఇవ్వాళ డీ- అడిక్షన్ సెంటర్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన 17సంవత్సరాల మైనర్ బాలుడు గంజాయికి అలవాటుపడి స్నేహితులతో కలిసి మహారాష్ట్ర నుంచి గంజాయి కొనుగోలు చేసి గతంలో పట్టుబడడంతో కేసు నమోదు చేయడం జరిగిందని, ప్రతి నిత్యం గంజాయి సేవిస్తూన్నట్లు ఫిర్యాదు రావడంతో బాలున్ని పట్టుకొని వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడంతో అతనిపై 27(బి ) నుప్స్ యాక్ట్ ప్రకారం కోర్టులో హాజరు పరుచగా చెన్నూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి పర్వతపు రవి ఆదేశాల మేరకు బాలున్ని డీ- అడిక్షన్ సెంటర్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

Leave a Reply