ప‌న్నెండు మూగ‌జీవాలు మృతి

మ‌రో రెండు గొర్రెల‌కు గాయాలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ప్ర‌మాదం

తొర్రూరు రూరల్, అక్టోబర్ 17 (ఆంధ్రప్రభ): మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామ శివారులో ఖమ్మం- వరంగల్ హైవే రోడ్డును దాటుతున్న గొర్రెల మందపై గ్రానైట్ లారీ దూసుకుపోవడంతో 12 మూగ‌జీవాలు లారీ కింద‌ప‌డి మృతిచెందాయి. మ‌రో రెండు గొర్రెలు గాయ‌ప‌డ్డాయి. మాటేడు గ్రామానికి చెందిన బొల్లం వీరమల్లు తన గొర్రెల మందను మేతకు తీసుకెళ్తుండగా వేగంగా వస్తున్న గ్రానైట్ లారీ (Granite Truck) మందను ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంతో సుమారు 2 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వీరమల్లు కన్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు.

Leave a Reply