DC vs SRH | ఆపద్బాంధవుడు అనికేత్..

  • వరుసగా వికెట్లు కోల్పోయిన ఆరెంజ్ ఆర్మీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ, హైదరాబాద్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతోంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, విధ్యంస‌క‌ర బ్యాట‌ర్ల‌తో నిండిన టాప్ ఆర్డర్ కేవలం ఐదు ఓవర్లలో 37 ప‌రుగుల‌కే కుప్పకూలింది.

ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన యంగ్ స్టార్ అనికేత్ వ‌ర్మ‌.. జట్టుకు ఆపద్బాంధవుడ‌య్యాడు. కష్టాల కడలిలో ఉన్న జ‌ట్టుకు.. త‌న హాఫ్ సెంచ‌రీతో ఊపిరందించాడు. 34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల‌తో 50 ప‌రుగులు సాధించి హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు అనికేత్.

హెన్రిచ్ క్లాసెన్ తో జ‌త‌క‌ట్టిన అనికేత్.. ఐదో వికెట్ కు 77 ప‌రుగుల భాగ‌స్వామ్యం అంధించాడు.

14 ఓవ‌ర్ల‌కు హైద‌రాబాద్ స్కోర్ 123/7.

అంతకుముందు, ఓపెనర్ అభిషేక్ శర్మ (1), ఇషాన్ కిషన్ (2), నితీష్ కుమార్ రెడ్డి (0), ట్రావిస్ హెడ్ (22), హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమ్మిన్స్ (2) అవుట్ అయ్యారు.

Leave a Reply