Dayakar | బీఆర్ఎస్ సత్తా చాటాలి..

Dayakar | బీఆర్ఎస్ సత్తా చాటాలి..
బ్యాట్ గుర్తుకు ఓటు వేయండి
Dayakar | పెద్దవంగర, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇవాళ వడ్డేకొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దంతాలపల్లి పరశురామ్ తరపున ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. ఈసందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ఇంటింటికి ప్రచారం చేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని సూచించారు. డిసెంబర్ 14న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని సర్పంచ్ అభ్యర్థి దంతాలపల్లి పరశురాములు విజ్ఞప్తి చేశారు.


