Tirumala | స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..

Tirumala | స్వర్ణరథంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..
Tirumala | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తిరుమలలో జరుగుతున్న వసంతోత్సవాల సందర్భంగా శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై దర్శనమిచ్చి భక్తులకు కటాక్షం ప్రసాదించారు. వైభవంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పుణ్యం పొందారు.
వసంతోత్సవాల భాగంగా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పూజలు, వేదపారాయణాలు, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి స్వర్ణరథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా తిరుమల ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి రథోత్సవాన్ని దర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. “గోవిందా గోవిందా” నినాదాలతో తిరుమల ప్రాంతం మారుమోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలు, తాగునీరు, క్యూలైన్ నిర్వహణ వంటి సదుపాయాలు కల్పించారు. ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు అధికారులు పర్యవేక్షణ చేపట్టారు. వసంతోత్సవాల సందర్భంగా స్వామివారి స్వర్ణరథోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది.


