Dandepally | దండేపల్లికి చేరుకున్న సత్యసాయి రథోత్సవం

Dandepally | దండేపల్లికి చేరుకున్న సత్యసాయి రథోత్సవం

Dandepally | దండేపల్లి, ఆంధ్రప్రభ : భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్త రథయాత్రలో భాగంగా బయలుదేరిన ప్రేమ వాహిని రథోత్సవం శుక్రవారం దండేపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సత్యసాయి బాబా భక్తులు స్వామి వారి రథానికి బ్యాండ్ మేళాలు, దప్పుచప్పులు, మంగళ హారతులతో స్వాగతం పలికారు. చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కళాకారుల నృత్యాలు, సాయిప్రవచనాలు అందించారు. అనంతరం భక్తులు స్వామి రథాన్ని దర్శించుకొగా భక్తులకు సాయి విభూది, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply