Current shock | కరెంట్ షాక్‌తో ఎద్దు మృతి

Current shock | కరెంట్ షాక్‌తో ఎద్దు మృతి

  • రైతన్న లబోదిబో

Current shock | కుబీర్, ఆంధ్రప్రభ : కుబీర్ మండలంలోని మాలేగాం గ్రామానాకి చెందిన రైతు భూషణ్ ఈ రోజు ఉదయం పొలం గట్టుకు వెళ్లి ఎద్దును మేత కొరకు వదిలిపెట్టడంతో అది తింటూ తింటూ అక్కడున్న ట్రాన్స్ఫారం వద్ద పచ్చని మేత కొరకు వెళ్లి విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందింది.

రైతు ఎద్దు కరెంట్ షాక్ తో ట్రాన్స్ఫారం వద్ద గొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ ఎద్దు విలువ దాదాపు 90 వేల రూపాయలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతన్న కోరుతున్నారు.

Leave a Reply