Cultural | విద్యార్థులే గురువులైన వేళ….

Cultural | విద్యార్థులే గురువులైన వేళ….
Cultural | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం గుడిరేవులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School)లో స్వయం పాలన దినోత్సవం సందర్భంగా ఈ రోజు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు(Cultural Programs) అలరించాయి. జిల్లా విద్యాధికారిగా జశ్వంత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి గా బండారి నందిని, ఉపాధ్యాయులుగా గణేష్, అమూల్య, బన్నీ నవ్య, మనితేజ, వరుణ్ తేజలు వ్యవహరించారు.
