జనం ఉక్కిరి బిక్కిరి .. అధికారులు అప్రమత్తం

జనం ఉక్కిరి బిక్కిరి .. అధికారులు అప్రమత్తం

( నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) : బంగాళాఖాతంలో మంథా తుఫాను తాకిడితో నంద్యాల జిల్లా (Nandyal District) ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నంద్యాల జిల్లాలో సోమవారం అర్థరాత్రి నుంచే జడివాన ప్రారంభమైంది. మంగళవారం భారీ వర్షంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ లు మంగళవారం అధికారులను అలెర్ట్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆదేశించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు కళాశాలలకు మంగళ బుధవారాలు సెలవు దినాలుగా ప్రకటించారు.

ఈ తుఫాన్ ప్రభావం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలో ఒక్కరోజు 191.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలో 330 మైనర్ ఇరిగేషన్ ట్యాంకు (Irrigation tank) లో ఉన్నాయి. అందులో 200 ట్యాంకులు పూర్తిస్థాయిలో నిండి ఉన్నాయి. వీటి కట్టలు బలంగా ఉండేటట్టు బలపరచాలని మైనర్ ఇరిగేషన్ అధికారులకు అధికారులు సూచించారు. జిల్లాలోని 29 మండలాల తహసిల్దార్లు ఎంపీడీవోలు ఆళ్లగడ్డ నంద్యాల, నందికొట్కూరు, డోను ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో 21 వాగులు 54 గ్రామాల గుండా ప్రవహిస్తున్నాయని వాటి వద్ద ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో అధిక వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ పశు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వనరులు కలుషితం కాకుండా నిరంతరం నీటి నమూనాలు పరీక్షించి అవసరమైతే ప్రత్యామ్నాయ వనరులు చేపట్టాలని డీపీఓ లకు డిప్యూటీ సీఈఓ లకు సూచించారు. జిల్లాలో ఉన్న 13 సమ్మర్ స్టోరీస్ ట్యాంకులు సరిపడా నీటిని నిల్వ ఉంచుకొని తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. జిల్లాలో సుమారు 22 వేల కుటుంబాలు మట్టిమిద్దెల్లో నివాసం ఉంటున్నారు. వర్షాలకు మట్టి మిద్దెల కూలే ప్రమాదం నందున వారిని పునరావాస కేంద్రాల తరలించాలని సూచించారు.

నంద్యాల పట్టణంలో కుందునది, శ్యామ్ కాలువ, పరివాహక ప్రాంతాలు శ్యామ్ నగర్, దేవనగర్, బీసీ కాలనీ, గోపాల్ నగర్, సుందరయ్య నగర్, విశ్వనగర్. ఎన్జీవో కాలనీ, నూనెపల్లె , సలీం నగర్ ప్రాంతాల్లో సుమారు 800 కుటుంబాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని వారందరినీ సమీప పాఠశాలలో కమ్యూనిటీ హాల్స్ లో కళ్యాణమండపాల్లో పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆర్డీవో కు సూచించారు. వర్షం అధికంగా కురుస్తున్నందున ప్రజలు వాగులు వంతెనలు కాజ్ వే లు దాటకుండా ప్రజలకు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

నంద్యాల జిల్లాలో ఒక్కరోజులో 191.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. ఇందులో జిల్లాలోని పగిడాల మండలంలో ఇందులో జిల్లాలోని పగిడ్యాల మండలంలో 24.4 మిల్లీమీటర్లు, నందికొట్కూరులో15.8 మిల్లీమీటరు, ఆళ్లగడ్డలో 14.0 మిల్లీమీటరు, వర్షపాతం, మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడం విశేషం.

భారీ వర్షాలనే పద్యంలో ఉల్లి మొక్కజొన్న టమోటా రైతులు పంట కోతను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. జిల్లాలో ఇప్పటికే 30% మొక్కజొన్న కోత జరిగింది అధిక తేమ కారణంగా పంటలకు కూడా తక్కువ ధరలు పడే అవకాశం ఉన్నందున వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పంటలను కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.

Leave a Reply