Chief Whip | పంటలను ఎలుకల బారి నుండి కాపాడుకోవాలి

Chief Whip | పంటలను ఎలుకల బారి నుండి కాపాడుకోవాలి

ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ

Chief Whip | శావల్యాపురం, పల్నాడు జిల్లా (ఆంధ్రప్రభ) : రైతులందరూ భాగస్వాములై పంటలను ఎలుకల బారి నుండి కాపాడుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ.ఆంజనేయులు కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి చీఫ్ విప్ జీవీ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు ఎలుకల నిర్మూలన మందులను అందజేశారు. అధికారుల సూచనలను రైతులు సూచ పాటిస్తూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply