Crime | ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి…

Crime | ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి…
Crime | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. గాజువాక పరిధిలోని ఎల్వీ నగర్ ప్రాంతంలో నేవీ ఉద్యోగిగా పనిచేస్తున్న రవీంద్ర తన ప్రియురాలిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసుల సమాచారం ప్రకారం, వివాహితుడైన రవీంద్రకు మౌనిక (28) అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల డబ్బుల విషయంపై ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భార్య ఇంట్లో లేని సమయంలో మౌనికను ఇంటికి పిలిచిన రవీంద్ర, తలెత్తిన వాగ్వాదంలో కత్తితో ఆమెను హత్య చేసినట్లు తెలిసింది.
అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి కొంత భాగాన్ని ఫ్రిడ్జిలో ఉంచగా, మరో భాగాన్ని సంచిలో పెట్టి ఇంట్లోనే దాచినట్లు సమాచారం. అనంతరం రవీంద్ర స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
డబ్బుల కోసం వేధించడం వల్లే ఈ హత్య చేశానని నిందితుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతురాలి తల మాత్రం కనిపించకపోవడం మరింత సంచలనం సృష్టిస్తోంది.
