Crime | మహిళ మృతదేహం

Crime | నర్సంపేట క్రైమ్, ఆంధ్రప్రభ : మండలంలోని మాదన్నపేట చెరువు కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్టు నర్సంపేట సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. నీటిపై తేలుతూ క‌న‌బ‌డడంతో స్థానికులు గుర్తించి సమాచారం అందించారని, సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని వెలికి తీసి, ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. మృతురాలు నీలి రంగు చీర, ఆకుపచ్చ రంగు జాకెట్ ధరించి ఉందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Leave a Reply