అంబేద్కర్ జయంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్..

వెల్దండ, ఆంధ్రప్రభ ; మండల పరిధిలోని కొట్ర గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కొట్ర ప్రీమియర్ లీగ్-8ని గ్రామ సర్పంచ్ శారద చెన్నయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, యువత క్రీడల్లో ముందుకు రావాలని, క్రీడలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్నేహభావాన్ని పెంపొందిస్తుందని తెలియజేస్తూ గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు.
ఈ ప్రీమియర్ లీగ్ ద్వారా గ్రామ యువతలో క్రీడా స్పూర్తి పెంపొందుతుందని, ఇటువంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సేవా సమితి అధ్యక్షులు పోనుగోటి రవీందర్రావు, యూత్ కాంగ్రెస్ నాయకులు కడారి శ్రీనివాస్ యాదవ్, టోర్నమెంట్ నిర్వాహకులు ప్రశాంత్, అంజి, అశోక్ క్రీడాకారులు పర్వతాలు మల్లేష్, పరమేష్, మధు, చంటి, అంజి, సందీప్, పరమేశ్వర్, రాజేష్, సిద్ధార్థ మోర్య, అశోక్, పోలమోని ప్రవీణ్, రామాచారి, మహేందర్ శ్రీశైలం, అల్లాజి, రవి, చందు, అరవింద్, గణేష్ అంజి క్రీడాకారులు పాల్గొన్నారు.
