Cricket tournament | క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Cricket tournament | క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
Cricket tournament | తిర్యాణి, ఆంధ్రప్రభ : మండల సాధకులు మాజీ జెడ్పిటిసి హనుమండ్ల మల్లయ్య వర్ధంతిని పురస్కరించుకొని ఆయన స్మారక క్రికెట్ టోర్నమెంట్(Cricket tournament)ను ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాల విలేసి నివాళులర్పించారు.
అనంతరం చింతపల్లి క్రికెట్ గ్రౌండ్లో టెంకాయ కొట్టి పోటీలను ప్రారంభించారు. మల్లయ్య మొదటగా సర్పంచ్ గా అనంతరం జడ్పిటిసిగా మండలానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ఇప్పుడు ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయిన ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. క్రీడాకారులు(players) క్రీడా స్ఫూర్తితో ఆటలాడి గెలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం రాజయ్య, మడావి గుణవంత్ రావు, గాయంగి మల్లేష్, కిలిశెట్టి శంకర్, టెంట్ శ్రీనివాస్, వాసాల సత్యనారాయణ కార్యకర్తలు నాయకులు ఆయన అభిమానులు క్రీడాకారులు పాల్గొన్నారు.
