Craze Heroine | పెళ్లి చేసుకునేది ఎవర్ని..?

Craze Heroine | పెళ్లి చేసుకునేది ఎవర్ని..?

Craze Heroine | టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్
పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు
అనుపమ మనసు దోచుకుంది ఎవరు..?

Craze Heroine | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇప్పుడు టాలీవుడ్ (Tollywood) లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టుంది. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 29న పెళ్లి చేసుకోబోతున్నాడు. సంగీత దర్శకుడు కాల భైరవ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్టుగా న్యూస్ లీకైంది. అది కూడా కెరీర్ లో బిజీ అవుతున్న టైమ్ లో పెళ్లి చేసుకోతుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఎవరా క్రేజీ హీరోయిన్..? ఆమె మనసు దోచుకుంది ఎవరు..?

Craze Heroine

Craze Heroine | మలయాళ ముద్దుగుమ్మ..

పెళ్లికి రెడీ అవుతున్న క్రేజీ హీరోయిన్ ఎవరో కాదు.. అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందట. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా మూవీస్ చేస్తూ.. కెరీర్ లో బిజీ అవుతుంది. ఇలాంటి టైమ్ లో.. మ్యారేజ్ కి చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఆమె కెరీర్ గురించి చెప్పాలంటే.. తెలుగులో (Telugu) అఆ, ప్రేమమ్, శతమానంభవతి సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించి అటు ఆడియన్స్ లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Craze Heroine

Craze Heroine | పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు..

ఆతర్వాత కృష్ణార్జున యుద్దం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అలాంటి టైమ్ లో రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ (Sai Srinivas) కు జంటగా నటించింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో మళ్లీ బిజీ అయ్యింది. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. టిల్లు స్వ్కేర్ సినిమాతో యూత్ కి మరింత దగ్గరయ్యింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పై ఫోకస్ పెట్టింది. కెరీర్ ఇప్పుడు మంచి దశలోనే ఉంది. ఈ టైమ్ లోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటుంది.

Craze Heroine

Craze Heroine | అనుపమ మనసు దోచుకుంది ఎవరు..?

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తినే పెళ్లి చేసుకోబోతుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ వార్త లీకైనప్పటి నుంచి అనుపమ మనసు దోచుకుంది ఎవరు..? అనే చర్చ మొదలైంది. అయితే.. హీరోయిన్ మ్యారేజ్ (Marriage) గురించి వార్తలు రావడం.. ఆతర్వాత అలాంటిది ఏమీ లేదని స్టేట్మెంట్స్ ఇవ్వడం మామూలే. మరి.. అనుపమ కూడా ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదు అని చెబుతుందా..? లేదంటే.. పెళ్లి కబురు చెబుతుందా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Craze Heroine

Leave a Reply