John Wesley | మా పోరాటాలు తగ్గవు.. ఆగవు!

  • ప్రజలతో నిరంతర మమేకమే మా విధానం
  • ట్రిపుల్‌ ఆర్‌ నిర్వాసితుల తరఫున నిరాఘాటంగా ఉద్యమిస్తున్నాం
  • సీపీఐ లేకుండా వామపక్షాల కూటమి సాధ్యపడదు
  • ఆపరేషన్‌ కగార్‌ నిలిపేయాలి.. మావోయిస్టుల చర్చలు జరపాలి
  • ఆంధ్రప్రభతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

John Wesley | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రజలతో మమేకమై అన్నివర్గాల ప్రజలు తరుఫున పోరాటం చేయడమే తమ పార్టీ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. ప్రస్తుతం ఏ పార్టీతోనూ తమకు అవగాహన పొత్తు రాజకీయాలు లెెవని తెెలిపారు. రాజకీయంగా భద్రశత్రువు అయిన బీజేపీని వ్యతిరేకించే పరిస్థితులు వచ్చినప్పుడు కాంగ్రెస్‌కు అంశాలవారీ మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అంతేగానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉందని పోరాటాలు ఎక్కడా ఆపలేదని చెప్పుకొచ్చారు. ట్రిపుల్‌ఆర్‌ భూసేకరణ విషయంలో రైతుల పక్షాన తమ అనుబంధ సంఘమైన రైతు సంఘ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నామని గుర్తు చేశారు. అడవులను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకే ఆపరేషన్‌ కగార్‌ కేంద్రం చేపట్టిందని పేర్కొన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలన్నదే తమ డిమాండ్‌ అని పేర్కొన్నారు. తమకు సర్దుబాటు కంటే ప్రజాసమస్యలు పరిష్కరించడమే ముఖ్యమని, అందువల్ల సీపీఐతో కలిసే ప్రసక్తి తమకు లేదని, సీపీఐ లేకుండా వామపక్షాల కూటమి సాధ్యపడదని స్పష్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తో ఆంధ్రప్రభ ప్రత్యేక ఇంటర్వ్యూ…

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు తగ్గించినట్లు ఉంది? ఎందువల్ల?
ప్రజల పక్షాన ఉంటూ మా పోరాటాలు ఎక్కడా తగ్గలేదు. పేదలకు అండగా నిలిచేందుకు రాజీలేని పోరాటాలు చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం. భవిష్యత్తులో మరిన్ని పోరాటలు చేస్తాం. అవసరమైతే ఉధృతం చేస్తాం. ప్రజాసమస్యల విషయంలో కాంగ్రెస్‌ వ్యతిరేకంగా నిలబడతాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలపై వినతి పత్రాలు అందజేశాం. ప్రస్తుతం ఉద్యమాల చేపట్టాం. కాంగ్రెస్‌ పార్టీతో అవగాహన ఒప్పందం లేదని, కానీ బీజేపీని వ్యతిరేకించే విషయంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో మతన్మోద విషయాలపై కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామన్నారు.

చట్టసభల్లో ఎందుకు అడుగు పెట్టలేకపోయారు?
మా పార్టీ సర్దుబాటు రాజకీయాలు చేయడం లేదు. గత అసెంబ్లిd ఎన్నికల్లో మేము ఒంటరిగా పోటీ చేశాం. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌తో ఎన్నికల అవగాహన ఒప్పందంలో భాగంగా ఒక అసెంబ్లిd సీటును ఇస్తామని చెప్పింది. అయితే ఒక్క సీటు మా పార్టీ వద్దు అనుకొని విడిచి పెట్టింది. ఎన్నికల సమయంలో సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, భద్రాచలం సీటును దక్కించుకుంది. అదే సమయంలో మేము కోరిన భద్రాచలం ఇవ్వకుండా మిరియాలగూడ సీటును కెెటాయించారు. దీన్ని మా పార్టీ అంగీకరించలెెదు. ఎలాంటి పొత్తులు లేకుండా 19 అసెంబ్లిd స్థానాల్లో ఒంటరిగా పోటీ చేశాం. చట్టసభల్లో అడుగు పెట్టలేదని మాకు బాధ లేదు. నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నాం.

వామపక్షాలు కూటమిగా ఏర్పడుతుందా?
సీపీఐ సర్దుబాటు చేసుకుని శాసనసభలో ఒక సీటు, శాసనమండలిలో రెండు సీట్లు దక్కించుకున్నారు. అలాంటి సర్దుబాటు ఏ పార్టీతో మేము చేసుకోవడం లేదు. మాకు సర్దుబాటు కంటే ప్రజాసమస్యలు పరిష్కరించడమే ముఖ్యం. అందువల్ల సీపీఐతో కలిసే ప్రసక్తి మాకు లేదు. సీపీఐ లేకుండా వామపక్షాల కూటమి సాధ్యపడదు.

ట్రిపుల్‌ఆర్‌ నిర్వాసితుల తరుఫున ఉద్యమం ఎందుకు నిలుపు చేశారు?
ట్రిపుల్‌ఆర్‌ నిర్వాసితుల తరుఫున ఉద్యమం ఆపలేదు. జూబ్లిdహిల్స్‌ ఉప ఎన్నికలు ఉన్నందున తాత్కలికంగా నిలుపు చేశాం. ట్రిపుల్‌ ఆర్‌ కోసం సేకరించిన భూముల విలువ విపరీతంగా పెరిగాయి. అయితే ప్రభుత్వం చెల్లించే మార్కెట్‌ ధరకు రైతులు అంగీకరిస్తే.. ప్రజాభిప్రాయసేకరణ గ్రామసభల ద్వారా నిర్ణయించి పరిహారం చెల్లించాలి. ఒక వేళ రైతులు అంగీకరించకపోతే భూమికి భూమి ఇవ్వాలని మా డిమాండ్‌. జూబ్లిdహిల్స్‌ ఎన్నికల అనంతరం ఈ పోరాటం ఉధృతం చేస్తాం. పార్టీ కేంద్ర కమిటీ సూచన మేరకు కార్యాచరణ రూపొందించి పోరాటం ఉధృతం చేస్తాం.

పరువు హత్యలపై మీరు ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు?
ఇటీవల కాలంలో పరువు హత్యలు అధికంగా జరుగుతున్నాయి. ఆసిఫాబాద్‌లో కులాంతర వివాహం చేసుకున్న ఆదివాసీ మహిళ శ్రావణి తన మామే హత్య చేశారు. ఈ సంఘటనపై నేను స్వయంగా వెళ్లి పూర్తి వివరాలు సేకరించి పోరాటం చేశాం. ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ను కూడా ముట్టడి చేశాం. తొమ్మిది నెల గర్భిణి అని చూడకుండా కిరాతకంగా హత్య చేశారు. బిడ్డ పుడితే ఆస్తులు పంచాల్సి ఉంటుందన్న భావనతోనే హత్య జరిగింది. ఇలాంటి హత్యలు నివారించాలంటే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా నిందితుడి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హత్యకు గురైన ఆమె కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని, ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ను ముట్టడి చేశారు. తమ డిమాండ్లు ఈ నెల 20వ తేదీలోగా నెరవేర్చాలని, లేకుంటె కలెక్టరేట్‌ ముట్టడి చేయనున్నాం.

మీరు రాష్ట్రకార్యదర్శిగా ఎన్నికైన తర్వాత పార్టీని ఎలా నిర్మాణం చేస్తున్నారు?
సంగారెడ్డిలో సీపీఎం రాష్ట్ర మహాసభల్లో తాను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాను. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలపై పోరాటం చేయకుండా స్థానిక సమస్యలపై పోరాటం చెెస్తాం. తొలుత ఐదారు నెలలు స్థానిక సమస్యలపై పోరాటం చేస్తాం. క్షేతస్థాయిలో కార్యకర్తలు, నాయకులు పర్యటించి స్థానిక సమస్యలు గురించి తెలుసుకుని పోరాటాలు చేస్తాం.

మీ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఎందుకు తగ్గింది?
తాత్కలిక ప్రయోజనాలను ప్రజలు ఆశిస్తున్నారని, దీర్ఘకాల అభివృద్ధి కోసం ఎవరూ ఆలోచించడం లేదు. నాకేమి ప్రయోజనం, నాకేమి అవసరం అని ప్రజలు ఆలోచిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో ఆదరణ తగ్గింది. ప్రజలు ఆలోచన శైలి మార్పు కోసం మేము ప్రయత్నిస్తున్నాం. అయితే జాతీయ, రాష్ట్ర స్థాయి పోరాటాల కంటే స్థానిక సమస్యలపై పోరాటాలు ఎక్కువగా చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇలాంటి పోరాటాలతో ప్రజలతో మమేకమైతే ప్రజాదరణ పొందగలం. అందుకే స్థానిక సమస్య పరిష్కారం కోసం ఫోకస్‌ చేస్తున్నాం.

ఆపరేషన్‌ కగార్‌పై మీ పార్టీ అభిప్రాయం ఏమిటి?
వెంటనే ఆపరేషన్‌ కగార్‌ను నిలిపి వేయాలని సీపీఎం డిమాండ్‌. మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి కోరాం. మావోయిస్టులతో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. వచ్చే ఏడాది మార్చి 31లోగా మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రధాని మంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. అయితే ఇది హత్యలను ప్రోత్సహించడమే. ఇది రాజ్యాంగ విరుద్ధం. మావోయిస్టులను నిర్మూలిస్తామనే హక్కు ప్రధాని, హోం మంత్రికి లేదు. కార్పొరేట్‌ సంస్థలకు అడవులను అప్పగించేందుకు ఆపరేషన్‌ కగార్‌ చేపట్టారు. ఆదివాసులు అమాయకులు. వారికి అన్యాయం జరిగితే అడిగలేరు. ఆదివాసుల తరుఫున అడిగే వారు వామపక్షాలు. అందుకే వారిని హత్య చేసి కార్పొరేట్‌ సంస్థలకు అడవులను అప్పగించేందుకు ఈ ఆపరేషన్‌ కగార్‌ చేపట్టారు.

Leave a Reply