CPI Centenary | ఉత్సవాలకు తరలివెళ్లిన..

CPI Centenary | ఉత్సవాలకు తరలివెళ్లిన..

  • సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు

CPI Centenary | కరీమాబాద్, ఆంధ్రప్రభ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఖమ్మం పట్టణ కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభకు సీపీఐ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. భారీ సభకు 5లక్షల మందితో జరిగే భారీ బహిరంగ సభకు వెళుతున్న ఏఐటీయూసీ జిల్లా కార్మికులు తరలివెళ్లారు.

ఈసందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ మాట్లాడుతూ…. 44 కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా చేసి కార్మికులు సాధించి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల‌ను వెన‌క్కి తీసుకోవాలన్నారు.

ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు బడా బూర్జువా పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకువచ్చార‌న్నారు. ఈ చట్టాలను వెన‌క్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (కాంగ్రెస్ )ఏఐటీయూసీ అండ్ భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ దశాబ్దాలుగా పోరాటాలు నిర్వహిస్తోందని, సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభ‌ ఖమ్మంలో జరుగుతుందనీ తెలిపారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పుట్టి 100 సంవత్సరాల చరిత్రలో పేద ప్రజలకు అండగా నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమిస్తుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదల సమస్యలు, ముఖ్యంగా ఇండ్లు, ఇండ్ల స్థలాలు, సాగు భూములు, రైతులు, వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నడుపుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ అన్నారు.

దేశంలో వందేళ్ల ప్రస్థానంతో ముందుకు సాగుతూ నాడు స్వాతంత్రోద్యమం నుండి నేటి వరకు ప్రజల కోసం ఉద్యమించిన ఏకైక పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. 40దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని, దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సిపిఐ ప్రతినిధులు, శ్రేణులు లక్షలాదిగా తరలివస్తున్నార‌న్నారు.

కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న కార్మికులందరినీ ఒక తాటి మీదికి తీసుకొచ్చి ఉద్యమాలు నిర్వహిస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పుల రవి, తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి సభ్యులు కలకోట్ల రాజు, నాగవెల్లి శంకర్, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి రహెళ, జిల్లా నాయకులు భాస్కర్ల సతీష్, సంధ్యారాణి, లావణ్య, రజిత, శోభ, మధుసూదనా చారి, యోగానంద చారి, పద్మ, సుభాషిని, విక్టోరియా, రమేష్, సుజాత, కవిత, వరలక్ష్మి, పీహెచ్ స్వరూప, జి.స్వరూప, ఏ రజిత, హరీష్, ఐలయ్య, తాళ్ల పెళ్లి శోభ హాలియా ఎండి సర్వర్ మున్ని హేమలత, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply