సమ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ

సమ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ
కరీమాబాద్, ఆంధ్రప్రభ : సమసమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని త్యాగాల పోరాటాల పార్టీకి చేయూతనివ్వండి – ఆర్ధికంగా సహకరించి ఆదరించండి- సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాష్ మియా అన్నారు. శనివారం శివనగర్ తమ్మెర భవన్ లో సిపిఐ వరంగల్ మండల సమితి సమావేశం మస్క సుధీర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాష్ మియా మాట్లాడుతూ ..భారత గడ్డపై వందేళ్ళు పూర్తి చేసుకొని దేశాన్ని, మతోన్మాద, కార్పోరేట్ కభంద హస్తాల నుండి విముక్తి చేసి సమసమాజ స్థాపనకై రాజీలేని పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), కార్మిక, రైతు, మహిళ, విద్యార్ధి, యువజన, కవులు, కళాకారులు తదితర ప్రజాసంఘాలు నిర్మించి వెట్టి చాకిరి విముక్తి, కార్మికులను, కర్షకులను దోపిడి నుండి విముక్తి చేయడానికి పోరాటాలు చేస్తున్న పార్టీ సిపిఐ.
ఈ దశాబ్దకాలంలో ఎన్నో పోరాటాలు, ఎన్నోత్యాగాలు, ఎంతో మంది అమరవీరుల రక్తతర్పణతో ఎన్నో విజయాలు సాధించి భారతదేశ రాజకీయ చరిత్రలో సిపిఐ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదనీ ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించేందుకు స్థలం లేక, పక్కా ఇల్లు లేక, దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు.
అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి దాపురించిందని అన్నార. సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పనాస ప్రసాద్ దండు లక్ష్మణ్, వరంగల్ మండల కార్యదర్శి గుండె బద్రి, జిల్లా కార్యవర్గ సభ్యులు బుస్స రవీంధర్ మండల సహాయ కార్యదర్శిలు జన్ను రవి పరికరాల రమేష్ నాయకులు ల్యాదల్ల శరత్ తాళ్లపల్లి రాహేల లావుడియా దస్రు చిలకల రాజు ఆరే రాజు మనోహర్ షబానా విక్టోరియా సండ్రకుమార్ తదితరులు పాల్గొన్నారు
