నిమ‌జ్జ‌న ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

బాలాపూర్ (Balapur) గ్రామంలో కొలువైన అతిపెద్ద వినాయకుడికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (Hyderabad Police Commissioner CV Anand), జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner) ఆర్‌వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ (Hyderabad Collector) హరిచందన, హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) రంగనాథ్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (MP Konda Vishweshwar Reddy) తో పాటు ఇతర ఉన్నత అధికారులు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి, నిర్వాహకులు కలిసి శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని పరిశీలించారు.

Leave a Reply