Covert’s | కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటాం..

Covert’s | కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటాం..

Covert’s | నిజాంపేట, ఆంధ్ర ప్రభ : స్థానిక గ్రామ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొన్ని స్థానాలలో గెలవక పోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ ల(Covert’s)ని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ లో కోవర్టులు ఉండటం వల్లనే కొన్ని స్థానాలలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారని మీడియా(media) సమావేశంలో తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ కెసిఆర్ కుటుంబం 10 ఏళ్లలో దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ఈ రోజుల్లో ఒక సర్పంచ్ అభ్యర్థి నుండి వార్డు మెంబర్ గా గెలవాలంటే తప్పకుండా డబ్బులు పంచితేనే గెలిచే పరిస్థితి ఏర్పడిందని రాజకీయాల్లో(politics) పోటీ చేయాలంటే అభ్యర్థులు పోటీ చేయలేని పరిస్థితి నెలకొందని దీనికి కారణం బీఆర్ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.


కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లలోనే సంక్షేమ అభివృద్ధి(welfare development) పనులు చేపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంటు, రైతుబంధు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది నిజం కాదని మీ గుండెలపై చేతివేసుకొని చెప్పాలని ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసిరారు.

నిజాంపేట మండలాన్ని మరింత అభివృద్ధి(development) పథంలో నడిపించేందుకు తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్,మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అమర సేనా రెడ్డి, రాజు, సుప్రభాతరావు, యాదగిరి, రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, రమేష్ రెడ్డి, వెంకటేశం, సరాఫ్ యాదగిరి, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply