కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : సింగరేణి కంపెనీ సీఎండీ బలరాంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు, తప్పుడు ఆరోపణలపై కేసు నమోదు చేసినందుకు ఫిర్యాదుదారు సంపత్ కుమార్‌ను మందలించి, రూ.20,000 జరిమానా విధించింది.
బలరాం సీఎండీ పదవికి అన్ని విధాలుగా అర్హుడేనని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఆధారాలు లేకుండా కేసులు దాఖలు చేసి కోర్టు సమయం వృధా చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణల కారణంగా సంపత్ కుమార్ పై కోర్టు రూ.50,000 జరిమానా విధించిన సంగతి గుర్తుంది. ఇలాంటి ప్రవర్తనపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో నిరాధారమైన ఆరోపణలు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

