counting | పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

counting | పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

counting | సదాశివనగర్, ఆంధ్రప్రభ : మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వయోవృద్ధులు ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా గొప్ప విషయమన్నారు.

ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని అధికారుల(officials)కు సూచించారు. మండలంలోని గ్రామాలలో సర్పంచ్, వార్డు, సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తరువాత లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు(counting) అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. ఉపసర్పంచ్‌ను సైతం ఈరోజు సాయంత్రమే ఎన్నుకోనున్నారు.

Leave a Reply