Counting | ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు…

Counting | ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు…

  • తేలనున్న అన్నిపార్టీల అభ్యర్థులు భవితవ్యం…
  • ఫలితాల కోసం అభ్యర్థుల తీవ్ర ఉత్కంఠ
  • ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం
  • మధ్యాహ్నం 2 గంటలలోపు పూర్తి ఫలితాలు
  • 18 వార్డులకు 18 టేబుళ్లు
  • 36 మంది సిబ్బంది, 120మంది పోలీసుల బందోబస్తు

Counting | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ శుక్ర వారం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ శాల, కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రం, పోస్ట ల్ బ్యాలెట్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకు న్నట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు అన్నీ సమగ్రంగా సిద్ధం చేశామని వెల్లడించారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

-ఉదయం 8గంటల నుంచి లెక్కింపు…

శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 18 వార్డులకు అనుగుణంగా 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెం ట్లు విధులు నిర్వహిస్తారు. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీకి సంబం ధించి మొత్తం 18 బృందాలను నియమించారు. ప్రతి బృందంలో ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్ వైజర్ ఉంటారు. ఇందులో నాలుగు బృందాలను రిజర్వ్‌గా ఉంచి అవసరమై తే వినియోగించేలా సిద్ధంగా ఉంచారు. అదనంగా పర్యవేక్షణ కోసం ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్ సూపర్ వైజర్ లు బాధ్యతలు చేపడతారు.

-మధ్యాహ్నానికే ఫలితాలు వెల్లడి…

18 వార్డుల ఫలితాలు మధ్యాహ్నం రెండు గంటలలోపు పూర్తిగా వెలు వడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రతి రౌండ్ అనంతరం వెంట వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.

అభ్యర్థుల్లో ఉత్కంఠ …

ఫలితాలపై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రైవేట్ సర్వేలు వెలు వడినప్పటికీ వాటిని పక్కన పెట్టి అధికారిక ఫలితాలకే అందరూ ఎదు రుచూస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికల్లా మున్సిపాలిటీ భవిష్యత్ పాలనపై స్పష్టత రానుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరగనుండటంతో పట్టణంలో రాజకీయ వాతా వరణం ఉత్కంఠభరితంగా మారింది.

click here to read more : Polling is over | బెల్లంపల్లిలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

click here to read more :

Leave a Reply