కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ…
హక్కుల కోసం పోరాడదాం అంటే..
విపక్షాలు కుంటి సాకులతో దూరం
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభః కేసులకు భయపడే కేటీఆర్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. నేరాలు చేసే వాళ్లే కేసులకు భయపడతారని, తాను కాదని తెల్చి చెప్పారు.. రేవంత్ టీడీఆర్ స్కామ్ చేయనున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందిస్తూ, అసలు కేటీఆర్ గురించి మాట్లాడటం వేస్ట్ అని అన్నారు.
కిషన్ రెడ్డి గారూ… మీరు తెచ్చిన మెట్రో ఎక్కడ .
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి మెట్రో తానే తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారని, ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు తీసుకొస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామని అన్నారు. ఎనిమిది మంది బిజెపి ఎంపిలున్నా రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకురాలేదని రేవంత్ మండి పడ్డారు.. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులున్నా ఎటువంటి ప్రయోజనం లేదన్నారు..
అభివృద్ధి కోసం అఖిల పక్షం నిర్వహిస్తే ..
రాష్ట్ర అభివృద్ధి కోసం అఖిలపక్ష భేటీ నిర్వహిస్తే.. రాలేదని దుయ్యబట్టారు రేవంత్ . హైదరాబాద్ కు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వస్తే ఈటల వచ్చారు కానీ కిషన్ రెడ్డి రాలేదని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అఖిల పక్షంపై ఆలస్యంగా సమాచారం ఇచ్చారనే అనుకుందామని.. మరి ఖట్టర్ కూడా ముందుగా సమాచారం ఇచ్చి వచ్చారా అని సెటైర్లు వేశారు. రాష్ట్రాలను కేంద్ర సమానంగా చూడటం లేదని అంటూ గుజరాత్‌కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారని, తెలంగాణ కు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ కడుతున్న పన్నులు ఎంత.. తిరిగి కేంద్ర తమకు కేటాయిస్తున్న నిధులపై తాన చర్చకు సిద్ధమని పేర్కొన్నారు రేవంత్ ..