Cotton mill | కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Cotton mill | కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- డిమాండ్లు ఒప్పుకుంటేనే విధుల్లో చేరుతాం
Cotton mill | ఊరుకొండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట శివారులోని సూర్యలత కాటన్ మిల్లు(Cotton mill) కార్మికుల సమ్మె నాలుగో రోజు కొనసాగుతున్నది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తమ సమస్యలు డిమాండ్ లు యాజమాన్యం ఒప్పుకొని అమలు చేస్తేనే విధుల్లో చేరుతామని భీష్మించుకుని కూర్చున్నారు.
నాలుగో రోజు ధర్నా(dharna)లో వంటావార్పు కార్యక్రమం సైతం ఏర్పాటు చేసుకోవడం కార్మికుల ఐక్యతకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు.
ప్రధానంగా యాజమాన్యం తమ వేతనాలను వెంటనే పెంచాలని, ఏరియర్స్ అందించాలని, పనికితగ్గ వేతనం చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు కార్మికులపై వేధింపులు ఆపాలని, మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికుల హక్కుల(workers’ rights)ను కాపాడాలని తమ జీవితాలను నాశనం చేయకూడదని డిమాండ్ చేశారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసన దీక్షలకు వివిధ రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కల్వకుర్తి సర్కిల్ సీఐ నాగార్జున ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
