construction | జిల్లా అభివృద్ధి, టీడీపీ విస్తరణే లక్ష్యం..

construction |జిల్లా అభివృద్ధి, టీడీపీ విస్తరణే లక్ష్యం..
- ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ..
construction | విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి తెలుగుదేశం పార్టీ విస్తరణే మా ప్రధాన లక్ష్యం అని ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ స్పష్టం చేశారు. తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గొల్లపూడిలో నిర్మాణం చేయనున్న ఎన్టీఆర్ జిల్లా నూతన టీడీపీ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని బుధవారం ఉదయం ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టి బాబు ఇతర టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు.
త్వరలో శుభముహూర్తంలో భూమిపూజ నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్థలాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరం, భవన రూపకల్పన, విభాగాల వారీ కార్యాలయ గదులు, సమావేశ మందిరం, మీడియా సెంటర్, శిక్షణ హాల్, డిజిటల్ కమ్యూనికేషన్ విభాగం, కార్యకర్తల కోసం ప్రత్యేక సదుపాయాల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక సాంకేతిక వసతులతో, పారదర్శకతకు ప్రతీకగా నిలిచే విధంగా కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ జిల్లా పార్టీ కార్యాలయం కేవలం భవనం మాత్రమే కాకుండా—పార్టీ కార్యకలాపాలకు శక్తివంతమైన కేంద్రంగా, కార్యకర్తలకు మార్గదర్శక వేదికగా, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయ కేంద్రముగా నిలిచేల నిర్మాణం చేస్తామన్నారు. టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ నాయకత్వంలో జిల్లా పార్టీ మరింత ప్రతిష్టను సంపాదిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్గా పనిచేసిన అనుభవం, పరిపాలనా దక్షత, ప్రజలతో ఉన్న అనుబంధం ఆమెకు బలమని పేర్కొన్నారు.

గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమస్యలపై స్పష్టమైన అవగాహనతో, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లే నాయకత్వ లక్షణాలు ఆమెకు ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో సభ్యత్వ విస్తరణ, యువతకు బాధ్యతల అప్పగింత, మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతం చేయడం, సోషల్ మీడియా మరియు డిజిటల్ వేదికల ద్వారా ప్రజలతో నిరంతర సంబంధాలు పెంపొందించడం వంటి కార్యక్రమాలను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ జిల్లా పార్టీ కార్యాలయం జిల్లా నడిబొడ్డున కార్యాలయం ఉండటం వల్ల అన్ని నియోజకవర్గాల ప్రజలకు, నాయకులకు సులభంగా చేరుకునే అవకాశముంటుందని తెలిపారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీ క్రియశీలక పాత్ర పోషిస్తూ, ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ, ప్రజల అభిప్రాయాల సేకరణ, సమస్యలపై సమర్థవంతమైన స్పందనకు ఈ కార్యాలయం కేంద్రబిందువుగా పనిచేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గొల్లపూడి టిడిపి ప్రెసిడెంట్ నూతలపాటి నారద, రాష్ట్ర వాణిజ్య ఉపాధ్యక్షుడు గూడపాటి పద్మశేఖర్ , విజయవాడ మార్కెట్ చైర్మన్ నర్రా వాసు , ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీను నాయక్, , టిడిపి నాయకులు బొర్రా తిరుపతిరావు టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ లతో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.