కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేకం

కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేకం

  • రచ్చ శ్రీనివాస్

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అరాచక, కమీషన్‌ల పాలనతో తెలంగాణను భ్రష్టు పట్టిస్తూ ప్రజల జీవనాన్ని దెబ్బతీస్తోందని బీజేపీ నాయకుడు రచ్చ శ్రీనివాస్ విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు నేతృత్వంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా, పోలీసులు తనను మరియు ఇతర నాయకులను అక్రమంగా ఇంటి వద్దనే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలిపారు. ఇటువంటి అక్రమ అరెస్టులకు భయపడబోమని స్పష్టం చేశారు.

ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పాలనకు ముగింపు పలుకుతారని అన్నారు.

అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని, ప్రజల సమస్యల పరిష్కారంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

ఈ ఘటనలో పట్టణ అధ్యక్షుడు కర్ర ప్రవీణ్, రాష్ట్ర కిసాన్ మోర్చా సభ్యుడు గుంటుపల్లి సత్యనారాయణ తదితరులు కూడా అరెస్టయ్యారు.

Leave a Reply