ఇంటి పన్ను పెంపుకు కాంగ్రెస్ ప్లాన్

ఇంటి పన్ను పెంపుకు కాంగ్రెస్ ప్లాన్
… కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి
…రెండేళ్లలో మున్సిపాలిటీల కు నయాపైసా ఇయ్యలే
…బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో పడ్డట్లే
… కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇంటి పన్నులు పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలు ముగియగానే ఇంటి పన్నుల భారం ప్రజలపై వేస్తారన్నారు. రెండేళ్లు గడుస్తున్న ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. 2023 లో అధికారం చేపట్టిన నాటి నుండి మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా నిధులు ఇవ్వలేదన్నారు. బిఆర్ఎస్ పార్టీకే ఓపేస్తే ఓటు డ్రైనేజీ లోనే వేసినట్లు అన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో అధికారం లేని బిఆర్ఎస్ నిధులు ఎలా తెస్తుందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, కబ్జాలతో దోచుకుతిన్నారన్నారు.
పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుందన్నారు. కరీంనగర్ లో జరిగిన అభివ్రుద్ధి అంతా కేంద్ర నిధులతోనేనని,
నేను పైసలు తీసుకొస్తే… బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కొబ్బరికాయ కొట్టి మావేనని చెప్పుకున్నారన్నారు.
మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే నిధులు తెచ్చే బాధ్యత నాది
కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పెట్టాలని భారతీయ జనతా పార్టీకి అప్పగిస్తే కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గత పది ఏళ్లలో వందల కోట్ల రూపాయల్లో నిధులు తీసుకొచ్చా.. ఈసారి బిజెపికి ఓటు వేసి మేయర్ పీఠాన్ని అప్పగించండి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా.
