Congress Party Sarpanch | ఓట్లు తారుమారు చేశార‌ని ఫిర్యాదు

Congress Party Sarpanch | ఓట్లు తారుమారు చేశార‌ని ఫిర్యాదు

Congress Party Sarpanch | చెన్నూర్, ఆంధ్రప్రభ : అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అధికారులతో కుమ్మకై తమ ఓట్లను తారుమారు చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులతో కలిసి ఎంపిడీఓకు ఫిర్యాదు చేసినట్లు కోటపెల్లి మండలం కొండంపేట ఇండిపెండెంట్ అభ్యర్థి నీల సంతోషి తెలిపారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 17న మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపెల్లి మండలంలోని కోడంపేట గ్రామ ఎన్నికల్లో పోలింగ్ అనంతరం జరిగింది. ఈ ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి అధికారులు ఏకపక్షంగా ఉండి ఓట్లు తారుమారు చేసి తప్పుడు ఫలితాలు ప్రకటించారని ఆరోపించారు. ఈ విషయంపై ఆర్డీఓకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply