Congress Member | సంగంబండ సర్పంచిగా గవినోళ్ళ సుమిత్రమ్మ ఘన విజయం

Congress Member | సంగంబండ సర్పంచిగా గవినోళ్ళ సుమిత్రమ్మ ఘన విజయం
Congress Member | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మండలంలోని సంగంబండ గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గవినోళ్ళ సుమిత్రమ్మ ఘన విజయం సాధించారు. 1565 ఓట్లు పోల్ కాగా విజేత సుమిత్రమ్మకు 1042 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థికి ఆశనోళ్ళ లక్ష్మమ్మ కు 381 ఓట్లు లభించాయి. దీంతో సుమిత్రమ్మ 661 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టుగలిగిన సంగంబండలో బి కే ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకొని ఎన్నికలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుండి గవినోళ్ళ సుమిత్రమ్మ ను బరిలో నిలిపి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు .ఎన్నికల్లో కీలకంగా పని చేశారు.ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ పైఎత్తులతో మండలంలోనే భారీ మెజారిటీ విజయం సాధించగలిగారు. గవినోళ్ళ సుమిత్రమ్మ సంగంబండ సర్పంచ్ గా గెలుపొందడంతో గ్రామంలో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ వర్గాలు సంబరాలు జరుపుకుంటున్నారు.
